క్యూకడుతున్న పేద, మధ్య తరగతి గర్భిణులు


Sat,August 24, 2019 01:27 AM

-ప్రభుత్వ వైద్యశాలల్లో పెరుగుతున్న సాధారణ ప్రసవాలు
-ప్రత్యేకాకర్షణగా కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, 102వాహనాలు
-గర్భిణులు, బాలింతలతో కిటకిటలాడుతున్న దవాఖానలు
-భయం, మొహమాటం వీడి సంతోషంగా వస్తున్న మహిళలు

..నల్లగొండ జిల్లాలో జిల్లా కేంద్ర వైద్యశాలతో పాటు 3ఏరియా దవాఖానలు, 6కమ్యూనిటీ న్యూట్రిషన్ హెల్త్ సెంటర్లు, మరో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్,13 ప్రాథమిక అరోగ్య కేంద్రాలు(12గంటల సేవలు), 18ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(24గంటలు సేవలు), 4అర్బన్ హెల్త్ సెంటర్లు, 257సబ్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రామీణులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా క్రమంగా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

జిల్లా కేంద్ర దవాఖానతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌ల్లో రోజుకు వెయ్యి మంది వరకు ఔట్ పేషెంట్లు, ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. సర్కారు దవాఖాల్లో వైద్యం మెరుగుపడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని దవఖాల్లో 8478 ప్రసవాలు జరిగితే అందులో 4353 ప్రసవాలు జిల్లా ప్రభుత్వ వైద్యశాల్లో జరిగాయి. అందులో పీహెచ్‌సీల్లో 111, వైద్యవిదాన పరిషత్ పరిధిలోని ఐదు దవాఖాల్లో 4242మంది మహిళలు ప్రసవించారు.

సమూల మార్పులకు శ్రీకారం...
తెలంగాణ రాష్‌ర్టం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవఖానలపై దృష్టి సారించి అభివృద్ధి దిశగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అత్యాధునిక పరికరాలు, సకల సౌకర్యాలు, సిబ్బందిని ఏర్పాటు చేయడంతోపాటు ఉద్దీపన పథకాలు కూడా ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేస్తుడడంతో గర్భిణుల తాకిడి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా 15రకాల వస్తువులను అందజేస్తుండడంతో ప్రసవాలు పెరగుతున్నాయి. అమ్మ ఒడి ద్వారా ఆర్థికంగా అదుకోవడంతోపాటు పుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు, అనారోగ్యం బారిన పడకుండా చూసుకునేందుకు ఇస్తున్న వస్తువులు ఎంతో ఉపయోగ పగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 20268కేసీఆర్ కిట్లు రాగా 19,471మంజూరు చేయగా 17,850కిట్లు నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. జిల్లాకు వచ్చిన కిట్లలో మంజూరు పోనూ మిగతా 797కిట్లు దవఖాల్లో అందుబాటులో ఉన్నాయి.

కేసీఆర్ కిట్...
2017 జూన్2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రసవానంతరం ఇంటికి వచ్చాక పిల్లల సంరక్షణ ప్రధానంగా భావిస్తారు. ఈ సమయంలో శిశువులకు ఉలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవడం కష్టమే. గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలు అంతంత మాత్రమే కనుక ఇలాంటి వారికి కేసీఆర్ కిట్ ఎంతో ఉపయోగ పడుతోంది. బిడ్డను పడుకోబెట్టడానికి మెత్తటి, దళసరి వస్త్రంతోపాటు దుప్పటి(బెడ్‌షీట్), స్నానానికి ఉపయోగించే సబ్బు, ఒంటికి, తలకి రాసే నూనె, పౌడరు, వెచ్చదనం కోసం మఫ్లర్లు, మేజోళ్లు, చేతి తోడుగులు, దోమలు కుట్టకుండా ఉండడానికి దోమ తెర గొడుగు తదితర 16రకాల వస్తువులు కిట్‌లో ఉంటాయి. కిట్ విలువ సుమారు రూ.2వేలు ఉంటుంది.

అమ్మాయి పుడితే అదనంగా వెయ్యి..
పేద వర్గాలకు చెందిన మహిళలు గర్భం దాల్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఏ దవాఖానలోనైనా పేరు నమోదు చేసుకోవచ్చు. గర్భిణీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేసి సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. రెండోసారి పరీక్ష చేయించుకున్న వేంటనే రూ.3వేల నగదు గర్భిణీ బ్యాంకు ఖాతాలోకి బదిలీ అవుతుంది. ప్రసవం జరిగిన వెంటనే అమ్మాయి పుడితే రూ.5వేలు, అబ్బాయి పుడితే రూ.4వేలు జమ అవుతాయి. శిశువుకు మూడున్నర నెలలు వచ్చే సరికి ఐదు రకాల వ్యాక్సిన్‌లు ఇప్పిస్తారు. వ్యాక్సిన్లు ఇచ్చిన అనంతరం మరో రూ.2వేలు బ్యాంకులో జమవుతాయి. అన్ని రకాల రోగ నిరోధక వ్యాక్సిన్ల అనంతరం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిన తరువాత మిగతా రూ.3వేలు బ్యాంకులో జమవుతాయి.

సర్కారు దవాఖానల
పటిష్టతకు కృషి...
సర్కారు దవాఖానల్లో అవసరమైన సౌకర్యాల కల్పనపైన ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్యుల నియామకంతో పాటు, అవసరమైన సిబ్బందిని సమకూర్చుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు దవాఖానల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలు తేల్చి 2,118 వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. మరో మూడు వేల పోస్టులు అదనంగా అవసరమని అంచనా వేసిన వైద్య ఆరోగ్య శాఖ... సీఎం కేసీఆర్ అమోదం తెలిపిన వెంటనే భర్తీ ప్రక్రియ ప్రారంభించనుంది. ఐసీయూ కేంద్రాలను నెలకొల్పడం ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

వివరాల నమోదు ఇలా..
-ఏఎన్‌ఎంలు తమ పరిధిలోని గ్రామాల్లో గర్భిణులను మొదటి నెల నుంచే గుర్తిస్తారు. వారి పూర్తి వివరాలను ట్యాబ్‌లో నమోదు చేస్తారు.
-పేరు, ఊరు. వయస్సు, మొదటి/రెండో గర్భం, బ్యాంకు ఖాతా నెంబర్, అమెకున్న ఆరోగ్య సమస్యలు ఇందులో ఉంటాయి.
-నెల వారీగా చేయించుకున్న పరీక్షలు. వ్యాధుల వివారలు సైతం పూర్తిస్థాయిలో నమోదు చేయడంతోపాటు నెలవారి టీకాల వివరాలు పొందుపర్చుతారు.
-ప్రసవం అనంతరం కూడా వివరాలు ఇదే విధంగా జత చేస్తారు.
-ఈ వివరాలన్నీ హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదవుతాయి. ఈ మేరకే గర్భిణికి నిర్ధిష్ట సమయాల్లో ప్రోత్సాహక నగదు అమె బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...