నిజాయతీ చాటుకున్న 108 సిబ్బంది


Sat,August 24, 2019 01:21 AM

-గాయపడిన వ్యక్తి నగదును బంధువులకు అప్పగింత
పెద్దఅడిశర్లపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి చికిత్స అందించడమే కాకుండా అతని వద్ద ఉన్న నగదును బంధువులకు అప్పగించి 108 సిబ్బంది పరమేష్, సత్యనారాయణ నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకెళ్తే... కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన కుంచాల కరుణ గురువారం రాత్రి మండలంలోని చిలకమర్రి స్టేజీ వద్ద బైక్ పైనుంచి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందిచడంతో సిబ్బంది ప్రథమ చికిత్స చేసి క్షతగాత్రుడిని దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అదే సమయంలో అతడి వద్ద ఉన్న రూ.లక్షా ఏడు వేల నగదును 108 సిబ్బంది సత్యనారాయణ, పరమేష్ వారి బంధువులకు అప్పగించారు. నిజాయితీగా నగదు అందించిన ఇద్దరిని పలువురు అభినందిచారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...