ఆకుపచ్చ తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం


Sat,August 24, 2019 01:20 AM

మాడ్గులపల్లి : రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జేసీ చంద్రశేఖర్, మండల ప్రత్యేకాధికారి నాగేశ్వరరావుతో కలిసి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో నాటిని ప్రతి మొక్క సంరక్షించేలా అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఐదు మొక్కలు నాటాలన్నారు. మండలంలో సుమారు 12లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పని చేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలన్నారు. జేసీ మాట్లాడుతూ మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండలంలోని తోపుచర్ల గ్రామానికి చెందిన రైతులు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ మౌళాలి ఆధ్వర్యంలో వరద కాల్వ చివరి భూములకు నీళ్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్లెంల సైదులు, ఎంపీడీఓ శంకర్‌నాయక్, మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...