జిల్లాలో పలుచోట్ల వర్షం


Sat,August 24, 2019 01:20 AM

నీలగిరి : జిల్లావ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో 22 మండలాల్లో వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం జిల్లాలోని మునుగోడు, మాడ్గులపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు పడగా 2, 3 మండలాల్లో మోస్తారు వర్షం పడింది. గుర్రంపోడులో 134.8 మి.మీ.అత్యల్పంగా దేవరకొండలో 2.1 మీ.మీ వర్షపాతం నమోదైంది. పెద్దవూర-73.8, చండూరు -51.4, కనగల్-39.4, అడవిదేవులపల్లి-19.3, తిరుమలగిరి(సాగర్)-19.3, అనుముల , హాలియా-16.0, శాలిగౌరారం-11.2, పీఏపల్లి-9.9, మునుగోడు-9.4, నకిరేకల్-8.4, నిడమనూరు-7.7, వేములపల్లి-7.6, నాంపల్లి-7.5, దామరచర్ల-7.3, చింతపల్లి-7.2, మిర్యాలగూడ-7.2, మాడ్గులపల్లి-7.0, కేతేపల్లి -6.7, మర్రిగూడ-5.7, కొండమల్లేపల్లి-4.3, దేవరకొండ-2.1 వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి నేటి వరకు 327.4 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 251.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. పంట కాలానికి సంబందించి సాధారణ వర్షపాతానికి -23 శాతం తక్కువగా కురిసింది.
కనగల్ వాగుకు వరద కనగల్ : మండల కేంద్రంలోని వాగులో గురువారం రాత్రి కురిసిన వర్షానికి వరద నీరు ప్రవహిస్తుంది. వాగులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...