పరిసరాల పరిశుభ్రత పాటించాలి


Sat,August 24, 2019 01:20 AM

మాడ్గులపల్లి : పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని జేసీ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని పాములపాహాడ్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామదర్శినిలో భాగంగా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెరిగిన పిచ్చి మొక్కలను చూసి అధికారులను మందలించారు. దో మలు, కీటకాల వల్ల కొత్త రోగాలు ప్రభులుతాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే దోమలు వ్యాపిస్తాయన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలను విరివిరిగా నాటాలన్నా రు. దవాఖానలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పౌష్టికకాహారం అందిచడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి నాగేశ్వర్‌రావు, ఇన్‌చార్జి తహసీల్దార్ యంశ్వత్, ఇన్‌చార్జి ఎంపీడీఓ శంకర్‌నాయక్ తదితరులు ఉన్నారు.

గామ సమాగ్రాభివృద్దికి తోడ్పడాలి : ఆర్డీఓ
మిర్యాలగూడరూరల్: అధికారులు సమన్వయంతో కుటకింది తండా సమగ్రాభివృద్ధికి కృషిచేయాలని ఆర్డీఓ జగన్నాథరావు కోరారు. గ్రామదర్శినిలో భాగంగా మండల పరిధిలోని కుంటకింది తండాలో శుక్రవారం అన్ని శాఖ అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకో వడంతో పాటు స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రథమిక పాఠశాల ఏజెన్సీ మహిళలు వండుతున్న మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మెనూ పాటిస్తున్నారా అని అడిగితెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని దర్శించారు. హరితహారంలో గ్రామస్తులం తా పాల్గొని విరివిరిగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తేజావత్ సావిత్రి, ఎంపీడీఓ అజ్మీరా దేవిక, తహసీల్దార్ కార్తీక్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఐబీ, ట్రాన్‌కో ఏఈలు చిల్లంచర్ల ఆదినారాయణ, మౌనిక, విజయలక్ష్మి, శ్రీకాంత్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీని పరిశీలించిన అధికారులు
దామరచర్ల: గ్రామదర్శినిలో భాగంగా మండల ప్రత్యేకాధికారి నాగమణి, తహల్దార్ సంతోష్ కిరణ్, ఎంపీడీఓ నాగపద్మజ శుక్రవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. దవాఖానలోని పరిసరాలు, రోగుల వార్డులను, ఆపరేషన్ గది, స్టాక్ రూంను పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పౌష్టికా హారం అందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఆర్.శంకర్ నాయక్, ఏఓ కల్యాణచక్రవర్తి తదితరులు ఉన్నారు.

ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలి
అడవిదేవులపల్లి : మండలంలోని మొల్కచర్ల గ్రామంలో శుక్రవారం గ్రామదర్శి ఏర్పా టు చేశారు. మండల ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్ మాట్లాడుతూ అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుర్రాసేవ్యానాయక్, ఎంపీపీ బాలాజీనాయక్, ఎంపీడీఓ షరీఫ్, సర్పంచ్ పెరుమాళ్ళ శ్రీను,అంగన్‌వాడీ సూపర్ వైజర్ నాగమణి, మాజీ సర్పంచ్ కుర్రా శ్రీను పాల్గొన్నారు.

వేములపల్లి : గ్రామ దర్శినిలో భాగంగా శుక్రవారం మండల ప్రత్యేకాధికారి మగ్బుల్ అహ్మద్ మండలంలోని శెట్టిపాలెం గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆరుగు మంగమ్మ, సర్పంచ్ మజ్జిగపు పద్మసుధాకర్‌రెడ్డి, పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...