పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి


Sat,August 24, 2019 01:19 AM

చండూరు, నమస్తే తెలంగాణ: పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. అడవులు క్షీణించడంతో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు సకాలంలో కురవకపోవడంతో కరువు కాటకాలు వస్తున్నాయన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఉపాధ్యాయులు పిల్లలకు మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థ్ధులు ప్రతి రోజు మొక్కల సంరక్షణకు కొంత సమయం కేటాంచడంతో భావితరాలకు పర్యావరణ కాలుష్యం నుంచి విముక్తి కల్పించవచ్చన్నారు. జిల్లాలో 4 కోట్ల 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ణయించగా, ఇప్పటి వరకు కోటి 60లక్షల మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో డీఈఓ సరోజినీదేవి, జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం, మున్సిపల్ ప్రత్యేకాధికారి శ్రీనివాసమూర్తి, ఎంపీపీ పల్లె కళ్యాణి, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ నరేందర్, ఎంఈఓ రవిందర్, సీఐ రవిందర్, ఏఓ మల్లేష్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...