589.90 అడుగులు


Sat,August 24, 2019 01:19 AM

నందికొండ : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో నీటి నిల్వను పూర్తి సామర్థ్యంకు పెంచడంతో సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. సాగర్‌కు శ్రీశైలం నుంచి 70,539 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా శ్రీశైలంకు జూరాల నుంచి ఇన్‌ఫ్లో లేదు. రోజా నుంచి శ్రీశైలంకు 22,613 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను శుక్రవారం నాటికి 589.90 అడుగులకు చేరుకొని 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయం నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 16,889 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9019 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 6401 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డీటి గేట్సు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 నీటి విడుదల కొనసాగుతుంది. సాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 35,019 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 883.70 అడుగుల వద్ద 208.2841 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో తగ్గింది.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...