వర్షం పడింది..


Fri,August 23, 2019 01:38 AM

-జిల్లావ్యాప్తంగా పలుప్రాంతాల్లో బుధవారం రాత్రి, గురువారం ఓమోస్తరు వర్షం కురిసింది. ఆకాశమంతా మేఘావృతమై కనిపించింది. వేములపల్లి, మునుగోడు, చండూరు, తిరుమలగిరి(సాగర్‌), పెద్దవూర మండలాల్లో మోస్తరు వర్షం పడింది. పలు మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. మొత్తం 19మండలాల్లో వర్షం కురవగా అత్యధికంగా వేములపల్లిలో 43.0 మి.మీ., అత్యల్పంగా నల్లగొండలో 2.3 మి.మీ. వర్షం పడింది.

రామగిరి : అల్ప పీడన ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో మోస్తారు వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో వర్షం కురవగా అత్యధికంగా వేములపల్లిలో-43.0, అత్యల్పంగా నల్లగొండలో-2.3 మి.మీ. వర్షం పడింది. అదే విధంగా చందంపేటలో 39.3, దామరచర్ల-35.4, అనుముల-32.6, త్రిపురారం-28.9, మిర్యాలగూడ-19.4, మాడ్గులపల్లి-14.0, నేరడుగొమ్ము-13, శాలిగౌరారం-10.9, గుండ్లపల్లి-10.4, కేతేపల్లి-9.2, గుర్రంపోడు-8.4, నిడమనూరు-6.1, అడవిదేవులపల్లి 6.0, మునుగోడులో 4.1, నకిరేకల్‌ , తిప్పర్తి, తిరుమలగిరిసాగర్‌లో-3.2 మి.మీ. వర్షం పడింది. గురువారం పెద్దవూర, అనుముల, మునుగోడు, నాంపల్లి, చండూరు, తిరుమలగిరి(సాగర్‌) మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ నెల 1 నుంచి 22 వరకు 236.5 మి.మీ. వర్షపాతం పడగా సాధారణ వర్షపాతం కన్నా 27.2 లోటు వర్షపాతం నమోదైంది.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...