మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంను


Fri,August 23, 2019 01:34 AM

-విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే
మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ఈనెల 25న నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ సభకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఎమ్మె ల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దామరచర్ల, అడవిదేవులపల్లి, వేములపల్లి,మాడ్గులపల్లి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. మార్కెట్‌ పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవ సభకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేగ్యానాయక్‌, ధనావత్‌ బాలాజీనాయక్‌, కటికం సైదిరెడ్డి, దు ర్గంపూడి నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, స్కైలాబ్‌నాయక్‌, బాబయ్య, రాజు, పుట్టల భాస్కర్‌, యూసూఫ్‌, కుర్ర సేవ్యా, జగదీష్‌, వెంకటేశ్వర్లు, అనంతలక్ష్మి, గోపీనాథ్‌, కోటిరెడ్డి ఉన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...