జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌కు సన్మానం


Fri,August 23, 2019 01:34 AM

దామరచర్ల: జగిత్యాల జిల్లా కలెక్టర్‌ అడావత్‌ శరత్‌కు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్సలెన్‌ ఇన్‌ గవర్నన్స్‌ అవార్డు రావడం గర్వకారణమని ఎస్‌ఎస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ అడావత్‌ జైత్రామ్‌ అన్నారు. అవార్డు గ్రహీత అడావత్‌ శరత్‌నుఈనెల 21న ఢిల్లీలో దామరచర్ల మండలం పర్తూనాయక్‌ తండా, కొండ్రపోల్‌ గ్రామానికి చెందిన పలువురు కలిశారు. పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. కలెక్టర్‌ శరత్‌కు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. విధుల్లో ఆయన నిర్వహించిన పారదర్శతకు నిదర్శనంగా పలు అవార్డులు వచ్చాయని, ఇతరులకు ఆదర్శప్రాయడన్నారు. కార్యక్రమంలో ఏ.మహేందర్‌, ఎంవీఐ నిర్మల్‌, న్యాయవాది మట్టపల్లి శ్రీధర్‌, ఏ.మోహన్‌, శశిధర్‌, కోటిరెడ్డి, శశికాంత్‌ తదితరులున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...