మూడేళ్లలో విద్యుదుత్పత్తి


Fri,August 23, 2019 01:34 AM

దామరచర్ల: యాదాద్రి పవర్‌ప్లాంటును మూడేళ్లలో పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తామని టీఎస్‌ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ తెలిపారు. యాదాద్రి పవర్‌ప్లాంటు పనులను గురువారం ఆయన పరిశీలించారు. ప్లాంటులో రైల్వేలైన్ల ఏర్పాటు, ఉద్యోగుల కాల నీ, టవర్‌ల నిర్మాణం, రోడ్లు, తదితర ప్లాంట్ల నిర్మాణ మ్యాపు పరిశీలించి, అధికారుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్లాంటులో నిర్మాణం చేస్తున్న సెక్కూరిటీ భవనం, క్యాంటిన్‌, ప్లాంటు మెయిన్‌ ప్లాంటు బాయిలర్లు, చిమ్నీలు, 5ప్లాంట్లకు సంబంధించిన పనులు పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోపు ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలన్నారు. రానున్న మూడేండ్ల లోగా రెండు యూనిట్లను పూర్తిచేసి 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, తరువాత ప్రతీ 3నెలలకు ఒకటి చొప్పున మూడు యూనిట్లను 2024లో పూర్తి చేసి 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామన్నారు.

ప్రాజెక్టు పనులు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిని కొనసాగుతున్నాయన్నారు. రైల్వేలైన్లకు సర్వే పూర్తైందని, అందుకోసం రైల్వే శాఖకు సంబంధించిన అధికారిని ప్రత్యేక డైరెక్టర్‌గా నియమించామని, పనులు మూడేండ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్టుకు కృష్ణాబేసిన్‌ నుంచి 6.5టీఎంసీల నీటి వినియోగం అనుమతి ఉందన్నారు. భూమికోల్పోయిన వారికి సంబంధించిన డబ్బులను జిల్లా కలెక్టర్‌కు ఇచ్చామని పంపిణీ బాధ్యత అతనిదే అన్నారు. సమస్యలను పరిశీలిస్తామన్నారు. ప్లాంటులో ఉద్యోగాలకు గతంలో ప్రజాభిప్రాయంలో చెప్పిన విధంగానే చేస్తామని, 526 మంది ల్యాండ్‌ లూజర్స్‌కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, టెక్నికల్‌గా ఐటీఐ చేపిస్తామని, ప్లాంటులో మొత్తం 4వేల ఉద్యోగాలకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీస్‌ జెన్‌కో సీఈ అజయ్‌, డైరెక్టర్‌ సదానందం, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ జగత్‌రెడ్డి, నర్సింగరావు, ఎస్‌సీ రామకృష్ణారెడ్డి, ఈఈ బుచ్చయ్య ఉన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...