కేసుల్లో పకడ్బందీ విచారణ చేపట్టాలి


Fri,August 23, 2019 01:33 AM

నల్లగొండక్రైం: రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని అప్పుడే ప్రాణాలు కోల్పోయిన వారికి త్వరగా న్యాయం అందించవచ్చని జిల్లా జడ్జి శశిధర్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు పరిస్థితి, సిగ్నల్స్‌ స్పీడ్‌బ్రేకర్లు, డివైడర్లు తదితరాలు పరిగణలోకి వస్తాయని వివరించారు.

ప్రమాదానికి గురై మరణించిన వ్యక్తి కుటుంబ వివరాలను సైతం ఆ కేసులో పొందు పర్చడం ద్వారా వారికి నష్టపరిహారం అందిస్తే కొంత న్యాయం చేసిన వారమవుతామన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత వాహనానికి బీమా లేకపోతే ఆ వాహనం సీజ్‌ చేయాలని స్పష్టం చేశారు. బీమా కంపెనీలు సైతం చెబుతున్న విషయాలు పరిగణలోకి తీసుకుని రోడ్డు ప్రమాద కేసులలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశానికి ముందు ప్రమాదాలు జరుగుతున్న తీరు, అక్కడ వాహనదారులలో ఎవరి తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందనే అంశాలపై వీడియో ప్రజంటేషన్‌ ద్వారా అధికారులకు ప్రదర్శించారు. సమావేశంలో నల్లగొండ ,సూర్యాపేట, ఎస్పీలు రంగనాథ్‌, వెంకటేశ్వర్లు, డీసీపీ నారాయణరెడ్డి, డీఎస్పీలు గంగారామ్‌, రమేష్‌, శ్రీనివాస్‌, మహేశ్వర్‌, ఉమ్మడి జిల్లాల ఎస్‌ఐలు, సీఐలు, పోలీసులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...