బాధ్యతతో పని చేస్తేనే గుర్తింపు


Fri,August 23, 2019 01:33 AM

నల్లగొండక్రైం : పోలీస్‌ శాఖలో పని చేసే హోంగార్డు స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు బాధ్యతతో పని చేయడంతో పాటు అన్ని పనుల్లో భాగస్వాములవ్వాలని అప్పుడే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం ద్వారా మంచి గుర్తింపు వస్తుందని ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కోర్టు కానిస్టేబుల్స్‌, సీసీటీఎన్‌ఎస్‌ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పోలీస్‌ పని విధానం పట్ల ఎంతో శ్రద్ధతో ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన బ్లాగ్‌ స్పాట్‌ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై గుర్తించిన బ్లాగ్‌ స్పాట్‌లలో ప్రమాదాలు జరిగితే సంబంధిత డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకుంటామన్నారు.

సీసీటీఎన్‌ఎస్‌ ఆపరేటర్లు విధిగా కేసు, దాని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. సంబంధిత నేరస్తుల గత చరిత్రను పొందు ప్చలన్నారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు పనిలో ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. స్టేషన్‌కు ఒక వాట్సప్‌ గ్రూప్‌ ఉండాలని, అవసరమైన సమాచారం అందులో ఉండాలని ఆదేశించారు. ఇసుక దందాలో ప్రమేయం ఉన్న ప్రతీ పోలీస్‌ అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీలు రమేష్‌, గంగారామ్‌, శ్రీనివాస్‌, మహేశ్వర్‌, సీఐలు రవీందర్‌, నరేందర్‌, సురేష్‌బాబు, శ్రీకాంత్‌రెడ్డి, పీఎన్‌డీ. ప్రసాద్‌, సత్యం, రవి, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...