సాగర్‌ @ 589.60 అడుగులు


Fri,August 23, 2019 01:33 AM

నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో సమానంగా కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు కొనసాగుతున్న నీటి ఇన్‌ఫ్లోను ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం, ఎడమ, కుడి కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను గురువారం నాటికి 589.60 అడుగులకు చేరుకొని 310.8498 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌ జలాశయం నుంచి ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 16,362 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9160క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 5510 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డీటీ గేట్సు (డైవర్షన్‌ టన్నల్‌) ద్వారా 10 నీటి విడుదల కొనసాగుతుంది. సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి మొత్తం 33742 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 884.40 అడుగుల వద్ద 212.4385 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు ఎగువ నుంచి 40848 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది.

మూసీ 628.80 అడుగులు
కేతేపల్లి : మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నీటిమట్టం గురువారానికి 628.80 (1.24 టీఎంసీలు) అడుగుల వద్ద నిలకడగా ఉంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 60 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు)అడుగులు. ఔట్‌ఫ్లో లేదు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...