నీటి సంరక్షణపై ప్రజలను చైతన్యం చేయాలి


Fri,August 23, 2019 01:32 AM

రామగిరి: వర్షపు నీటి ప్రాముఖ్యం, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జల శక్తి అభియాన్‌ ప్రారంభించినట్లు కేంద్ర జౌళి శాఖ సంయుక్త కార్యదర్శి , జలశక్తి, అభియాన్‌ నోడల్‌ అధికారి నిహార్‌ రంజన్‌దాస్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో గురువారం కనగల్‌, కట్టంగూర్‌, నాంపల్లి, పెద్దవూర, వేములపల్లి మండలాలకు చెందిన మండల పర్యవేక్షణ అధికారులు, ఎంపీడీఓలు, సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓలు, ఏపీఎంలు, ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు జల శక్తి అభియాన్‌పై వర్కు షాప్‌ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలశక్తి అభియాన్‌ ప్రజా ఉద్యమం.. గ్రామగ్రామానికి, ఇంటింటికి తీసుకెళ్లి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం కీలక పాత్ర అన్నారు. అధికారులతో కలిసి భాగస్వామ్యమైనప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. వర్షం నీరు వృథా చేయకుండా ఒడిసి పట్టు-సద్వినియోగం,సంరక్షణ చేసేలా జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ డా.గౌరవ్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ వర్షపు నీటిని వృథా గాకుండా సంరక్షణ, భూగర్భ జలాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇంకుడు గుంతలు, పర్కోలేషన్‌ ట్యాంకులు, వాటర్‌షెడ్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఏపీడీ నర్సింహారావు, ఉద్యానవన శాఖ అధికారి సంగీత లక్ష్మి, గిరిజన సంక్షేమ అధికారి నారాయణస్వామి, చేనేత జౌళి శాఖ ఏడీ జహీరోద్దీన్‌, ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ శంకరయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ పాపారావు పాల్గొన్నారు.
శివాజీనగర్‌: జలశక్తి అభియాన్‌లో భాగంగా లయన్స్‌ క్లబ్‌ నల్లగొండ స్టార్స్‌ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని సాయిరక్ష దవాఖాన ఎదుట ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతను జలశక్తి, అభియాన్‌ నోడల్‌ అధికారి నిహార్‌ రంజన్‌దాస్‌ కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ సభ్యులు వెంకట్‌రెడ్డి, ప్రకృతి ప్రేమికుడు సురేష్‌గుప్త, డా. అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...