ఎస్‌పీసీ విద్యార్థులను తీర్చిదిద్ధాలి


Thu,August 22, 2019 01:23 AM

నల్లగొండక్రైం: జిల్లాలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ పథకం కింద 25 ప్రభుత్వ పాఠశాలలు, సూర్యాపేట జిల్లాలో 14 పాఠశాలలు ఎంపికయ్యాయని, ఎంపికైన విద్యార్థులను దేశం గర్వించే విధంగా తీర్చిదిద్ధ్దాల్సిన బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులపై ఉందని డీటీసీ డీఎస్పీ ప్రతాపరెడ్డి అన్నారు. బు ధవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీస్ క్యాడెట్ల కింద ఎంపికైన ఆయా పాఠశాలలకు చెందిన 72 మంది ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌పీసీకి ఎంపికైన పాఠశాలల నుంచి ప్రత్యేకంగా 7వ తరగతిలో అధిక మార్కులు సాధించిన 22మంది విద్యార్థులను ఎంపిక చేయాలన్నా రు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, విద్యా శాఖ అధికారితో కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని వెల్లడించారు. శిక్షణ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉంటుందన్నారు. ఈ శిక్షణలో సంగారెడ్డికి చెందిన ఇన్‌స్పెక్టర్ రెహమాన్, డీటీఆర్‌బీ సీఐ అంజయ్య, ఆర్‌ఐ భూషణ్, సతీష్ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...