అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్


Thu,August 22, 2019 01:23 AM

నీలగిరి: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి శ్రీశైలం నుంచి వరద నీటి ఇన్‌ప్లో ఎక్కువగా వస్తున్నందున ఆ పరివాహక ప్రాంతంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. బుధవారం ఆయన జేసీ చంద్రశేఖర్, పోలీస్, ఎన్‌ఎస్పీ, ట్రాన్స్‌కో, జెన్‌కో, రెవెన్యూ, మత్స్య , అగ్నిమాపక, వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 589.30 అడుగులకు చేరినందున ఇన్‌ఫ్లో పెరిగి నీటి ఉధృతి అధికంగా ఉన్నందున ఏ సమయంలో నైనా గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు. దిగువ నీటి ప్రభా వం ఉధృతి ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ తమ సిబ్బందిని అందుబాటులో ఉంచి డ్యామ్‌పైకి, బోటింగ్‌కు పర్యాటకులను అనుమతించొద్దని, జాలరులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. దిగువ పరివాహక ప్రాంతంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...