ధరణి సమస్యలుపరిష్కరించాలి


Thu,August 22, 2019 01:22 AM

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ : ధరణి వెబ్‌సైట్‌కు సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జేసీ చంద్రశేఖర్ వీఆర్వోలకు సూచించారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండలాల వీఆర్వోలకు ధరణి వెబ్‌సైట్ సమస్యల పరిష్కారంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి వెబ్‌సైట్‌లో పెండింగులోఉన్న ఖాతాలను నమోదు చేసి రైతులకు పాసు పుస్తకాలు అందించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ కేఎంవీ జగన్నాథరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, డీ ఏఓ రఘునాథ్‌తహసీల్దార్‌లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...