అర్హులైన ప్రతీ రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం


Thu,August 22, 2019 01:22 AM

నీలగిరి: జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేసే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జేసీ వనమాల చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ధరణి పెండింగ్ ఖాతాలపై జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీటీ, వీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్ ఖాతాలపై సమీక్షించారు. ఈసందర్భంగా జేసి మాట్లాడుతూ ధరణి వెబ్‌సైట్‌లో ఖాతాల వివరాలు నమోదు చేసి త్వరితగతిన పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలాల వారీగా ఎన్ని ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి..? క్షేత్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న భూరికార్డులను వీఆర్వోలు, తహసీల్దార్లు విచారణ చేసి క్లీయర్ చేయాలన్నారు. ధరణి పెండింగ్ ఖాతాల పరిష్కారంలో మీ సేవ ముటేషన్లు, సక్సేషన్లు అలసత్వం చేయరాదని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, సూపరింటెండెంట్ చంద్రవదన పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...