నాగార్జునసాగర్ నీటిమట్టం 589 అడుగులు


Thu,August 22, 2019 01:20 AM

నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా బుధవారం 589.10 అడుగులకు చేరింది. పూర్తిస్థాయిలో నిండేందుకు కేవలం ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉంది. రిజర్వాయర్‌లో 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి 1,36,610 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32561 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9443 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8896 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డీటీ గేట్సు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి మొత్తం 53610 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.

మూసీనీటిమట్టం 628.80 అడుగులు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 628.80 అడుగుల (1.24 టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 34 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎటువంటి ఔట్‌ఫ్లో లేదు.

పులిచింతల @169 అడుగులు
చింతలపాలెం : పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు (45.77 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 169.81 అడుగులుగా (38.0890 టీఎంసీలు) ఉంది. ఎగువ ప్రాతాల నుంచి 36,494 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు ఒక గేటు నుంచి 11,409 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...