జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉండాలి


Wed,August 21, 2019 03:37 AM

- మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌రావు
సూర్యాపేటసిటీ : జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన వార్తలు రావాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తిరుమల గ్రాండ్ హోటల్‌లో ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్టులకు నిర్వహించిన ఒక్కరోజు మీడియా వర్క్‌షాపును జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులు అన్ని రంగాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మీడియా రిపోర్టర్లు నిత్య విద్యార్థుల్లా జ్ఞాన సముపార్జన చేయాలని సూచించారు. జర్నలిస్టులకు వర్క్‌షాపులు నిర్వహించి శిక్షణ అందించడానికి ముందుకు వచ్చిన ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరోను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఐపీబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మరియప్పన్, ఉస్మానియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ జర్నలిజం హెడ్ ప్రొఫెసర్ స్టీవెన్‌సన్, రచన స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్‌రావు, ఐపీబీ డిప్యూటీ డైరెక్టర్ పి.రత్నాకర్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ జి.కోటేశ్వర్‌రావు, శివచరణ్‌రెడ్డి, ఏపీఆర్‌ఓ హబీబ్, సీనియర్ జర్నలిస్టులు గుండా శ్రీనివాస్‌గుప్తా, దేవరశెట్టి రవి, వజ్జె వీర య్య, తోట నర్సయ్య, కంచుగట్ల ప్రవీణ్, చల్లా చంద్రశేఖర్, ఇల్లందుల గోపినాథ్, గుండేటి శ్రీధ ర్, మునగాల శ్రీనివాస్, కొడిదల భిక్షపతి, దేవరగట్ల సతీష్, కర్నే వేణుగోపాల్, అమరగాని నాగు లు, పల్లేటి నాగార్జున, నిదుర శ్రవణ్, ఓరుగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...