రోటా వైరస్ వ్యాక్సిన్‌పై అవగాహన ఉండాలి


Wed,August 21, 2019 03:36 AM

నీలగిరి: రోటా వైరస్ వ్యాక్సిన్‌పై మహిళా ఆరోగ్య కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. అన్నిమల్ల కొండల్‌రావు అన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం రోటా వ్యాక్సిన్‌పై మ హిళా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా రోటా వైరస్ వ్యాక్సిన్ ఎలా ఉపయోగించాలి దాన్ని వేసే విధా నం, ఎప్పుడు వేయాలి, ఎవరికి వేయాలి అన్న అంశాలపై ఆయన క్లుప్తంగా వివరించారు. ఈ వ్యాక్సిన్‌ను నోటి ద్వారా 2.5 మి.లీ. నోటిలో సిరంజితో వేయాలన్నారు. దీన్ని +2 నుంచి +0 ఉష్ణోగ్రతలో ఉంచాలని నీళ్ల వీరేచనాలు నియంత్రించేందుకు 2 యేళ్ల లోపు వయసు కలిగిన చిన్నారులందరికీ వేయాలని సూచించారు. పోలియో డీపీటీ వ్యాక్సిన్‌తో పాటు మూడు డోస్ లు , 9 నెలల వ్యవధిలో వేయవచ్చని తెలిపారు. దీంతో 75 శాతం రోగాలను నియంత్రించవచ్చని తెలి పారు. ప్రతి పోలియో డీపీటీ మొదటి డోస్ తీసుకునే పిల్లలందరికి ఇవ్వాలని సూచించారు. సదస్సులో డీవీ వేణుగోపాలరెడ్డి, డీఐఓ శ్రీనివాసస్వామి, ఎస్‌ఓ శాంతకుమారి, డెమో బిరుదుల వెంకన్న, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...