మొలకపట్నంలో జలశక్తి అభియాన్


Tue,August 20, 2019 01:50 AM

వేములపల్లి : నీటిని ఆదా చేస్తేనే మనిషి మనుగడ సాధ్యమవుతుందని సర్పంచ్ నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మొల్కపట్నం ప్రాథమిక పాఠశాల విద్యార్థ్దులకు, గ్రామస్తులకు ఏర్పాటు చేసిన జలశక్తి అభియాన్ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరి గోవర్దనీతో కలిసి మాట్లాడారు. నీటిని పొదుపుగా వాడుకునేందుకు ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. పాంపాడ్స్, డ్రిప్ ఇరిగేషన్, తుంపర సేద్యాలకు ప్రయోజనం కలిగించడంతో పాటు బోర్‌వెల్ రీచార్జ్, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి వాటిని ప్రోత్సహిస్తుందన్నారు.

భవిష్యత్‌లో నీటి కష్టాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో హరితహారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రెమడాల కరుణాకర్, ఏపీఓ శ్రీనయ్య, టీఏ వెంకట్త్న్రం, ఫీల్డ్‌అసిస్టెంట్లు నాగయ్య, అశోక్, కార్యదర్శి సామ్రాజ్యం, కానుగు రాములు, జేరిపోతుల గిరి, పేరెళ్లి నగేష్ పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...