సాగర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో


Mon,August 19, 2019 02:53 AM

- సాగర్ @ 586.20 అడుగులు
- డ్యాం 26 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల
- ఆదివారం 6 లక్షల మంది పర్యాటకుల సందర్శన
- సాగర్‌కు 2,80,206 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- శ్రీశైలంకు 3,65,953 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నందికొండ : కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గుతుండంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గింది. నాగార్జుసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదలను తగ్గిస్తూ దిగువకు నీటివిడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను చూడడానికి వస్తున్న పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు. రోజుకు లక్షల సంఖ్యలో వస్తున్న పర్యాటకులు ఆదివారం సెలువు దినం కావడంతో సుమారు 6 లక్షలకు పైగా సాగర్‌ను సందర్శించారు. పర్యాటకుల రాకతో వాహనాలు బా రులు దీరాయి. సాగర్ డ్యాం నుంచి దిగువకు 424233 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 10 గేట్లను నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు 2,80,206 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువన ఉన్న జూరాల నుంచి 3,65,953 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని రాజవరం వద్ద షెటర్లు మరమ్మతుల కోసం నిలుపుదల చేయగా, తి రిగి ఆదివారం నీటివిడుదలను ప్రారంభించారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వస్తున్న వరద నీటితో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ, ఎడమకాల్వ, కుడి కాల్వల ద్వారా ఆయకట్టుకు అధికారులు నీరు విడుదల చేస్తున్నారు.
నీటి సమాచారం
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.20 అడుగుల వద్ద 301.3570 నీరు ఆదివారం నిల్వ ఉంది. సాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,80,206 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. సాగర్ జలాశయం నుంచి 26 క్రస్ట్ గేట్ల ద్వారా 370760 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33089 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 11040 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 6634 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డీటి గేట్సు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 నీటి విడుదల కొనసాగుతుంది. సాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 424233 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 882.30 అడుగుల వద్ద 200.6588 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు ఎగువ నుంచి 3,65,953 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...