అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు


Mon,August 19, 2019 02:53 AM

- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణానికి చెందిన యువజన నాయకుడు చింత శివమూర్తి ఆధ్వర్యంలో వందమంది, మర్రూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో వందమంది నకిరేకల్‌లో ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్నివిధాలుగా అభివృద్ధి చెంది దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజల అవసరాలకనుగుణంగా సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో రైతాంగం కోసం రైతుబీమా, రైతుబంధు పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా సాగునీరందించి రైతును ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అతి స్వల్పకాలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీరందుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతను స్వయం ఉపాధివైపు ప్రోత్సహించడానికి సబ్సిడీ రుణాలను ప్రభుత్వం అందజేస్తుందని, పార్టీలో యువనాయకత్వాన్ని ప్రోత్సహించేవిధంగా కేటీఆర్‌కు వర్కింగ్‌ప్రెసిడెంట్ అప్పజెప్పారని ఆయన గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తుందని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్ళి పార్టీ పటిష్టతకు కృషిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పల్లెబోయిన బద్రి, ప్రగడపు నవీన్‌రావు, పల్లె విజయ్, బండమీది శంకర్ పార్టీలో చేరిన వారిలో కొండ క్రాంతి, వెంకన్న, పాలడగు సంపత్, జానీ, అజయ్ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...