సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు...


Sun,August 18, 2019 01:42 AM

లక్షమందికి పైగా రాక, ట్రాఫిక్‌కు అంతరాయం
ఆదివారానికి ముందస్తు జాగ్రత్తలు : ఎస్పీ నందికొండ/హాలియా, నమస్తే తెలంగాణ : నాగార్జునసాగర్ ప్రాజెక్టును శనివారం సుమారు లక్ష పైచిలుకు పర్యాటకులు సందర్శించారు. ఉదయం నుంచే బారులుతీరడంతో నాగార్జునసాగర్ పైలాన్ పోలీస్‌గ్రౌండ్ చౌరస్తా నుంచి జెన్‌కో గెస్ట్‌హౌస్ వరకు వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. క్రస్ట్‌గేట్ల నుంచి ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో భారీగా ఎగిసిపడుతున్న అలలను ఆస్వాదిస్తూ అలల తుంపర్లలో పర్యాటకులు తడుస్తు సెల్ఫీలు దిగుతూ సందడిచేశారు. పర్యాటకులు అధికసంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా విదేశీ పర్యాటకులు సైతం సాగర్‌ను సందర్శించి మంత్రముగ్ధులయ్యారు.

సాగర్‌ను సందర్శించిన ఎస్పీ రంగనాథ్
సాగర్ పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా కావాల్సిన ఏర్పాట్లను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి ఎస్పీ రంగనాథ్ పలు సూచనలు చేశారు. శనివారం ఆయన నాగార్జునసాగర్‌ను సందర్శించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రాంతాలను పరిశీలించారు. ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ పద్మనాధుల శ్రీనివాస్, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, సీఐలు దనుంజయ్, వేణుగోపాల్, ఎస్‌ఐ శీనయ్య ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...