రాయగిరిలో ఘన స్వాగతం..


Sun,August 18, 2019 01:41 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు శనివారం రోడ్డు మార్గంలో వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మండలంలోని రాయగిరి కమాన్ వద్ద ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 11.31 నిమిషాలకు జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్ ప్రత్యేక వాహనంలో వారు యాదాద్రికి వెళ్లారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...