రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి


Sun,August 18, 2019 01:41 AM

చివ్వెంల:రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఎస్.ఐ ఎన్.లవకుమార్ తెలిపి న వివరాల ప్రకారం ..విజయవాడకు చెం దిన కొవ్వాడ వెంకటనారాయణ(52) అమ్మ ప్రేమ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నాడు. గురువారం స్నేహితులతో కలిసి కారులో సొంత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో మండలంలోని వల్లభాపురం శివారులో జాతీయ రహదారి 65పై కారు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం సూ ర్యాపేటలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగగా పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు నాగేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...