బూర్గుల తండాలో పట్టపగలు చోరీ


Sun,August 18, 2019 01:40 AM

నేరేడుచర్ల : రైతు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రూ.6 లక్షల విలువగల బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మండలంలోని బూర్గులతండాలో శనివారం జరిగింది. బాధితుడి కేతావత్ మున్యా వివరాల ప్రకారం.. తాను కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనుల కోసం ఇంటికి తాళం వే వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. బీరువాలోని తన పెద్ద కమారుడు లక్ష్మణ్‌కు చెందిన 15 తు లాల ఆభరణాలు హారం, నక్లెస్, దిద్దులు, మ్యాటీలతో పాటు 10 తులాల వెండి పట్టీలు అపహరించుకోని పోయారని చెప్పారు. ఇటీవలే తన కుమారుడు లక్ష్మణ్‌కు వివాహం కావడంతో ఆభరణాలుగా చేయించినట్లు పేర్కొన్నారు. పొలం నుంచి ఇంటికి రాగా విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సంఘటనా స్థ్ధలానికి హుజూర్‌నగర్ సీఐ రాఘవారావు, ఎస్‌ఐ యాదవేంద్రరెడ్డి పరిశీలించి క్లూస్ టీంతో నమునాలను సేకరించారు. బాధితుడు మున్యా ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...