ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య


Sun,August 18, 2019 01:40 AM

-యువతికి నాలుగు నెలల క్రితమే వివాహం
మద్దిరాల : కడుపు నొప్పి భరించలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గురువోజు సోమాచారి,వెంకటమ్మల దంపతుల రెండో కుమారుడు నరేష్‌కు నాలుగు నెలల క్రితం తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన కటకం రవి,పద్మల పెద్ద కుమార్తె గురువోజు చందన (22)తో వివాహం జరిగింది. నరేష్ మండలంలోని ముకుందాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నరేష్ ఒక రోజు తప్పించి ఒక రోజు విధులకు వెళ్లేవాడు. శుక్రవారం కూడా నరేష్ విధులకు వెళ్లడంతో చందన, అత్త వెంకటమ్మ ఇద్దరే ఇంట్లోనే ఉన్నారు. చందనకు ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు నిద్రలేచే అలవాటు ఉంది.

శనివారం కూడా సమయం 8 గంటలు దాటుతున్న గదిలో నుంచి బయటకు రాలేదు. దీంతో అత్త వెంకటమ్మ గది తలుపులు తెరచి చూడడంతో ఇంటి దూలానికి చున్నీతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. ఏం చేయాలో అర్థం బిగ్గరగా రోదిస్తుంటే చుట్టు పక్కల వారు గమనించి వచ్చి చందనను కిందకు దిం చారు. వెంకటమ్మ కొడుకు నరేష్‌కు సమాచారం అందించడంతో జీవిత భాగస్వామి విగత జీవిగా కనిపించడంతో బోరున విలపించాడు. మృతురాలి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చందన మృతిపై ఏఎస్‌ఐ నికోలస్‌ను వివరణ కోరగా వివాహిత యువతి కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుందని శుక్రవారం రాత్రి ఎక్కువ కావడంతో భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. రవి మద్దిరాల పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు విధుల నిర్వర్తిస్తున్నాడు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...