భీమారం-సూర్యాపేట రోడ్డు పనులు పూర్తిచేయాలి


Sun,August 18, 2019 01:39 AM

వేములపల్లి : భీమారం-సూర్యపేట రోడ్డు పనులు ప్రారంభించి మూడేళ్లు గడిచినా పూర్తిగాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే పనులు పూర్తి చేయించాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మండల పరిధిలోని మొల్కపట్నం గ్రామం నుంచి ఎంపీపీ పుట్టల సునీత, సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డితో కలిసి పాదయాత్ర చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ఎస్‌డీ మౌలానాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, పల్లా వీర య్య, మాలి కాంతరెడ్డి, జడ రాములు, తమ్మడబోయిన అర్జున్, ఎల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, పుట్టల శ్రీను, రతన్‌సింగ్, శ్రీనివాసరావు, ద యాకర్‌రెడ్డి, గౌరు రమేష్, భిక్షం, సైదులు, కృ పయ్య, శ్రీనివాస్, ఆర్.పరుశరాములు, ఎం. పృధ్వీరెడ్డి, సైదులు,శ్రీను, సందీప్, ప్రవీణ్ కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...