ఇంటికి నిప్పంటించిన వారిని శిక్షించాలి


Sun,August 18, 2019 01:39 AM

మిర్యాలగూడ అర్బన్: రమావత్ పద్మ ఇంటికి నిప్పు అంటించిన వారిని శిక్షించి, ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని నంగారభేరి గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తేజావత్ నందకుమార్‌నాయక్ కోరారు. శనివారం ప్రకాష్‌నగర్‌లో నంగారభేరి గిరిజన సంఘం నాయకులతో కలిసి దగ్ధమైన ఇంటిని పరిశీలించి మాట్లాడారు. నిరుపేద కుటుంబానికి చెందిన పద్మ భర్త చనిపోగా ఒంటరిగా నివాసం ఉంటుందని, గుర్తుతెలియని దుండగులు ఈనెల 16న రాత్రి ఇంటికి నిపప్పంటించి పారిపోయారన్నారు. అధికారులు గుర్తించి నిప్పంటించిన వారిని శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో లింగా, అఖిల్, నాగేందర్, చందునాయక్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...