నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్


Sat,August 17, 2019 02:31 AM

-11వ సారి పర్యటిస్తున్న ముఖ్యమంత్రి
-షెడ్యూలును ఖరారు చేసిన సీఎంఓ
-ఏర్పాట్లు పర్యవేక్షించిన ఆలయ ఈఓ
(యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ)సీఎం కేసీఆర్ యాద్రాద్రి రాక సందర్భంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ కే. నారాయణరెడ్డి యాదాద్రిలో జరుగుతున్న పనులను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఈఓ ఎన్ గీత కొండపై సీఎం తిరిగే స్థలాలను శుభ్రం చేసే పనులు చేయించారు. ఆలయంలో గల దుమ్ము దూళిని తొలగించే పనులు చేయించారు. టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్ ఏరియాలలో వాహనాలు తిరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్‌రావు ఈవో గీతతో మాట్లాడి ఏర్పాట్లపై క్లారిటీ తీసుకున్నారు.

భారీ బందోబస్తు...
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు యాదాద్రి డీసీపీ కే.నారాయణరెడ్డి తెలిపారు. 600మంది సిబ్బంది బందోబస్తులో పాలు పంచుకోనున్నారు. రాచకొండ సీపీ మహేష్‌భగవత్ బందోబస్తును పర్యవేక్షిస్తారని చెప్పారు. ఇద్దరు డీసీపీలు, నలుగురు అడిషనల్ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, 400 మంది సిబ్బంది సీఎం బందోబస్తులో మమేకమవుతారు. కొండపైన పరిశీలన ప్రదేశాలతో పాటు సీఎం సమీక్ష నిర్వహించే టూరిజం అతిథి గృహాన్ని అణువణువు తనిఖీ చేశామని తెలిపారు. శనివారం యాదగిరిగుట్టలో ఎలాంటి ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. స్థానికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొండపైన దుకాణాలు మూసివేశాయాలని, ఆటోలు సీఎం వెళ్లిపోయేంత వరకు కొండపైకి అనుమతి లేదని చెప్పారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...