మూసీ 628.50 అడుగులు


Sat,August 17, 2019 02:28 AM

కేతేపల్లి : మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 628.50 (1.20 టీఎంసీలు) అడుగుల వద్ద నిలకడగా ఉంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో కేవలం 34 క్యూసెక్కులు మాత్రమే వస్తుం ది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో లేదు.

పులిచింతల @169.29 అడుగులు
చింతలపాలెం : పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 169.29 అడుగులు (37.3664 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 6,40,846 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుంది. పులిచింతల ప్రాజెక్టు మొత్తం గేట్లు 24 వాటిల్లో 22 గేట్ల నుంచి 7,03,570 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో విడుదలవుతుంది.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...