మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ


Sat,August 17, 2019 02:27 AM

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ : పట్టణంలోని చైతన్యనగర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన కొణతం సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ బంటు రామచంద్రు కుమారుడు రాజశేఖర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.అదే విధంగా వేములపల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మల్లంపాటి ఆంజనేయులు,గూడపురి శ్రీనివాస్ మృతదేహాలను సందర్శించి నివాళులర్పించి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట వింజం శ్రీధర్, రమణయ్య, లక్ష్మీనారాయణ, నిరంజన్‌రెడ్డి, అనిల్, సైదులు ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...