కృష్ణమ్మ పరవళ్లు


Fri,August 16, 2019 03:38 AM

-26 గేట్లతో నీటి విడుదల
-586 అడుగులకు చేరిన నీటిమట్టం
-8,79,632 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా అంతే మొత్తంలో నీటిని 26 క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు 8,79,632 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 7,20,734 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 26 గేట్లలో 8 గేట్లు 25 అడుగులు, 18 గేట్లు 16 అడుగుల ఎత్తు వరకు లేపి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. నీటి విడుదల భారీగా ఉండడంతో పైలాన్ శివాలయం ఘాట్ పూర్తిగా మునిగడంతో పాటు వరదనీరు శివాలయంలోకి చేరింది.

ప్రాజెక్టు నీటిమట్టం 586 అడుగులు
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గురువారం సాయంత్రం వరకు 304.4680 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 26 క్రస్ట్ గేట్ల ద్వారా 7,20,734 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32,764 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 7233 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 3549 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు, డీటీ గేట్లు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 7,35,605 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...