నిడమనూరులో విద్యుదాఘాతంతో రెండు బర్రెలు మృతి


Fri,August 16, 2019 03:34 AM

నిడమనూరు : విద్యుదాఘాతంతో బర్రెలు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జిల్లా సత్తెయ్యకు చెందిన రెండు బర్రెలు గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని పొలాల్లో మేతకు వెళ్లాయి. మేత మేస్తూ కాల్వ దాటుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తీగ తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. సుమారు రూ. 80 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు సత్తెయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరాడు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...