ఉత్తమ సేవకులకు ప్రశంసాపత్రాలు


Fri,August 16, 2019 03:33 AM

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : 73 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ చేతుల మీదుగా నియోజకవర్గంలో పనిచేస్తున్న వివిద శాఖలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం ప్రశంసాపత్రాలను అందించింది.

అడవిదేవులపల్లి తహసీల్దార్ కే.ప్రవీన్‌కుమార్, దామరచర్ల తహసీల్దార్ సంతోష్‌కిరణ్, మాడ్గులపల్లి నాయబ్ తహసీల్దార్ యశ్వంత్‌రాజ్, ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పీ.శ్యాంసుందర్, తహసీల్దార్ కార్యాలయం టైపిస్టు కే.శ్రీనివాస్‌రెడ్డి, మిర్యాలగూడ వీఆర్‌ఓ యూ.మల్లేష్, వేములపల్లి వీఆర్‌ఏ వీరస్వామి, డీఆర్‌డీఓ ఏపీడీ ఎస్‌వీ.సత్యనారాయణ, దామరచర్ల ఏఓ కళ్యాణ్ చక్రవర్తి, మిర్యాలగూడ ఏఈఓ విజయచంద్ర, వ్యవసాయమార్కెట్ కమిటీ సూపర్‌వైజర్ వేణుకుమార్, మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు సాయిలక్ష్మి, వెంకటేశ్వర్లు, అక్బర్ అహ్మద్, నాగయ్య, వేములపల్లి ఎంపీడీఓ కార్యాలయ టైపిస్టు సుజాత, మిర్యాలగూడ పీజీటీ ఉపాధ్యాయురాలు మాధురిశర్మ, మిర్యాలగూడ ఎక్సైజ్ కార్యాలయం ఉద్యోగులు మురళి, సుభాష్, ఏరియా దవాఖాన ఉద్యోగి జీ.కోటయ్య, మిర్యాలగూడ డీఎల్‌పీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మోషీన్‌బిన్‌అహ్మద్, మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ ఎం.పద్మ, మిర్యాలగూడ ఫైర్ మెన్లు డీ.శంకర్, టీ.రాములు, ఎంఈఓ ఎం.బాలాజీనాయక్, మాడ్గులపల్లి పీహెచ్‌సీ ఫార్మాసిస్టు ప్రదీప్‌కుమార్, వేములపల్లి పీహెచ్‌సీ ఉద్యోగి ఎస్.వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ సబ్‌జైల్ డిప్యూటీ జైలర్ బీ.నాగరాజు, సబ్‌జైల్ వార్డర్‌లు పీ.వెంకటరత్నం, రాము, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఫరీదాబేగం, అంగన్‌వాడీ టీచర్ పుష్పలత, ట్రైబర్ వెల్ఫేర్ కళాశాల జేఎల్ కే.నాగేందర్, ఈ.పెంచలయ్య, మెప్మా సీసీ శ్రీనివాస్, ఈఎస్‌ఐ దవాఖాన డా.రవితేజరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఎండీ.సాజీద్‌హైదర్, సీనియర్ అసిస్టెంట్ ఎం.ప్రవీన్‌కుమార్, దామరచర్ల మండలం కొండ్రపోలు జీపీ జూనియర్ అసిస్టెంట్ కే.జగదీష్, కేఎన్‌ఎం డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు రమేష్,ఫ్రాన్సిస్, ఆర్.శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్టీసీ డ్రైవర్ సతీష్, వేములపల్లి విద్యుత్ ఏఈ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...