ఘనంగా రక్షాబంధన్


Fri,August 16, 2019 03:32 AM

మిర్యాలగూడ అర్బన్ : శ్రావణ మాస పౌర్ణమిని పురస్కరించుకోని గురువారం పట్టణంలో ఇంటింటా రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. రాఖీ పండుగ కావడంతో పట్టణంలో ఉదయం మార్కెట్లో, స్వీట్ హౌస్‌లలో రాఖీలు కొనేందుకు, స్వీట్లు కొనుగోలు చేసేందుకు మహిళలు అధిక సంఖ్యలో రావడంతో ఎంతో సందడి ఉన్నది. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పి.శ్రీనివాస్ కు రాఖీ కట్టారు. అభ్యాస్ పాఠశాలలో విద్యార్థినిలు విద్యార్థులకు రాఖీలు కట్టారు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని గురువారం రాఖీ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉన్న చెల్లి, అక్కలు సోదరుల కోసం రాఖీ కట్టేందుకు తమ పుట్టింటికి వచ్చి రాఖీలు కట్టి సంతోషాన్ని పంచుకొన్నారు.

దామరచర్ల : అన్నచెల్లెల్ల అనురాగానికి ప్రతీక అయిన రాఖీపౌర్ణమి పర్వదిన వేడుకలను గురువారం మండలంలో ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, రాఖీ పండుగ రెండు ఒకేసారి రావడంతో రాఖీ పండుగను విద్యార్థులు, బాలికలు జెండాపండుగ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లి రాఖీ పండుగను జరుపుకున్నారు.

అడవిదేవులపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో రాఖీ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. కస్తూరిభా పాఠశాల విద్యార్థినీలు జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు గాదగోని మహేష్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఆడపడుచులు వారి సోదరులకు రాఖీని కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
వేములపల్లి : సోదర ప్రేమకు ప్రతిరూపం వారి అనురాగ ఆప్యాయతలకు నిలువెత్తు నిదర్శనమైన రాఖీ పండుగను గురువారం మండలంలో ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ముస్తాఖ్ అహ్మద్‌కు మహిళా సిబ్బంది రాఖీ కడుతూ తమ సోదరభావాన్ని వ్యక్త పరిచారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...