సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల


Thu,August 15, 2019 03:35 AM

నందికొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను సైతం తగ్గించారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు బుధవారం 7,84,917 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను 27 అడుగుల నుంచి 14 అడుగులకు తగ్గించి 4,15,390 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల ద్వారా సుమారు 16 లక్షల క్యూసెక్కులు (138 టీఎంసీలు) నీటిని దిగువకు విడుదల చేశారు.

నీటిమట్టం 583.40 అడుగులు
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 583.40 అడుగులుగా ఉంది. బుధవారం నాటికి ప్రాజెక్టులో 292.8208 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయం నుంచి 26 క్రస్ట్ గేట్ల ద్వారా 4,15,390 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,170 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8,367 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 5,944 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, డీటీ గేట్సు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 4,64,695 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...