కృష్ణమ్మ పరుగులు


Wed,August 14, 2019 02:11 AM

-నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో
-576.8 అడుగులకు చేరిన నీటిమట్టం
-డ్యాం 26 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల
-సురక్షిత ప్రాంతాలకు ముంపు గ్రామాల ప్రజలు
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు కృష్ణమ్మ పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. ఎన్నెస్పీ అధికారులు 26 క్రస్ట్ గేట్లను 27 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం సాగర్‌కు 937225 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. క్రస్ట్ గేట్ల ద్వారా 492048క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ.. ఎడమ కాల్వకూ నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా మంగళవారం రాత్రి వరకు 576.8 అడుగులకు చేరింది. వరద నీటితో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
సాగర్ ప్రాజెక్టు సమాచారం
పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు
ప్రస్తు నీటిమట్టం : 576.8 అడుగులు
ఇన్‌ఫ్లో : 937225 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 557086క్యూసెక్కులు
శ్రీశైలంలో..
పూర్తిస్థాయి నీట్టిమట్టం : 885 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 879.40
ఇన్‌ఫ్లో : 919260 క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో : 814931 క్యూసెక్కులు

పోటెత్తిన పర్యాటకులు
నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో ఆ మనోహర దృశ్యాన్ని చూసేందుకు మంగళవారం పర్యాటకులు పోటెత్తారు. డ్యాం, ప్రధాన జలవిద్యుత్ కేంద్ర పరిసరాలు, హిల్‌కాలనీ నుంచి కొత్త బ్రిడ్జి వరకు రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. దీంతో పలు సందర్భాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...