విద్యుదుత్పత్తిలో రాష్ట్రం ముందంజ


Wed,August 14, 2019 02:09 AM

-జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
చింతలపాలెం : విద్యుదుత్పత్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అహర్నిషలు శ్రమించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణకు పేరు తెచ్చామని తెలంగాణ జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వజినేపల్లి గ్రామం వద్ద పులిచింతల ప్రాజెక్టు అంతర్భాగంలో నిర్మించిన టీఎస్ జెన్‌కోను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 23లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న గొప్ప రాష్ట్రం తెలంగాణ అన్నారు. జలవిద్యుత్ ఉత్పత్తికేంద్రంను చేపట్టిన అతి తక్కువకాలంలోనే నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేసి విజయం సాధించామన్నారు. గత సంవత్సరం పులిచింతల ప్రాజెక్టులో సరిపడా నీరు లేనందున విద్యుదుత్పత్తి జరగలేదన్నారు. విద్యుదుత్పత్తి జరగాలంటే కనీసం 42మీటర్ల నీటిమట్టం ఉండాలన్నారు. ఒక్కో యూనిట్‌కు 30మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లకు 120మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చన్నారు. గత రెండురోజులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీరు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా చేరుకుంది. దీంతో ప్రాజెక్టులో ఉన్న 5వేల క్యూసెక్కుల నీటి ద్వారా జెన్‌కోలోని 2యూనిట్లతో 12మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఇంకా నీరు ఉధృతి పెరిగితే మిగతా 2యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో హైడెల్ టీఎస్‌జెన్‌కో డైరెక్టర్ వెంకటరాజన్, ఎస్‌ఈ సద్గున్‌కుమార్, ఎస్‌ఈ సివిల్ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈలు, ఏఈలు, ఈఈలు జెన్‌కో సిబ్బంది, ట్రాన్స్‌కో సిబ్బంది పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...