తెలంగాణ పోలీసులకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు


Wed,August 14, 2019 02:08 AM

నల్లగొండక్రైం: ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, డీజీపీ అమలుచేస్తున్న పలు విధానాల కారణంగా ప్రపంచదేశాలతో సమానంగా తెలంగాణ పోలీసింగ్ అమలవుతుందని ఎస్పీ రంగనాథ్ అన్నారు. శిక్షణ పూర్తిచేసుకుని విధుల్లో చేరిన ఆయన మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. శిక్షణలో భాగంగా సింగపూర్, జాతీయ పోలీస్‌అకాడమిలో నేర్చుకున్న పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు కాలనీలు, అపార్టుమెంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే విధంగా ప్రజలతో మమేకమయ్యేలా పనిచేయాలన్నారు. పోలీసులు ఒత్తిళ్లకు లొంగకుండా, రాజీ పడకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అప్పుడే లక్ష్యాలను చేరుకుంటారన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ నెంబర్‌వన్ స్థానంలో ఉండాలనే తపనతో పనిచేయాలన్నారు. పనితీరులో ఏ మాత్రం మార్పు కనిపించకపోతే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇకపై జిల్లాలో అన్ని పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేస్తామన్నారు. వచ్చేనెల నుంచి పోలీస్ స్టేషన్ వారిగా సమీక్షించడం జరుగుతుందన్నారు. సిబ్బందిలో అన్నిఅంశాల్లో ప్రతిభ కనబర్చిన వాల్లను గుర్తించి విదేశాలకు శిక్షణకు పంపిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల విషయంలో అవసరమైన చర్యలు తీసుకున్న నల్లగొండ డీఎస్పీ, నార్కట్‌పల్లి, నల్లగొండ రూరల్ ఎస్‌ఐలను అభినందించారు. సమావేశానికి ముందు పోలీస్ అధికారులందరికీ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ రూపొందించిన ప్రవర్తన, వీడియోతోపాటు సింగపూర్ పోలిసింగ్‌కు సంబంధించిన రెండు వీడియోలను ప్రదర్శించి అవగాహన కల్పించారు. సమావేశంలో డీఎస్పీలు గంగారామ్, మహేశ్వర్, సీఐలు రవీందర్, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, బాషా, నరేందర్, రమేష్, రమణారెడ్డి, రవికుమార్, నాగరాజు, ఆర్‌ఐలు ప్రతాప్, శంకర్, ఎస్‌ఐలు మధు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...