కూరెళ్లకు పురస్కారం.. పల్లెకు పట్టం కట్టినట్టే


Tue,August 13, 2019 02:16 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : కూరెళ్లకు పురస్కారం అంటే పల్లెకు పట్టం కట్టినట్టేనని తెలంగాణ సాహితీ అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. మహాకవి దాశరథి సాహిత్య పురస్కారం అందుకున్న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలోని సోమరాధాకృష్ణ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూరెళ్ల పల్లెలను సాహిత్య కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో విశేషంగా కృషి చేశారన్నారు. తెలంగాణ సాహిత్యంలో తనదంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ఆ దిశగా మరుగున పడ్డ కవులను వెలుగులోకి తీసుకువచ్చే బృహత్ కార్యక్రమానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రేత్యకాధికారి, ప్రముఖ గాయకులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ దాశరథి తెలంగాణ విమోచన కోసం చేసిన కృషిని కూరెళ్ల సజీవంగా ఉంచగలిగారన్నారు.

పల్లెలను ప్రేమించడం అంటే తనను తాను గౌరవించుకోవడమేనన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవులు లింగంపల్లి రామచంద్ర, తూర్పు మల్లారెడ్డి, హరగోపాల్, బెల్లి యాదయ్య, గంటా జలంధర్‌రెడ్డి, తండు కృష్ణకౌండిన్య, సామ మల్లారెడ్డి, సోమ సీతారాములు, తిరునగరి రంగయ్య, అభినయ శ్రీనివాస్, రచ్చ యాదగిరి, మోడె సత్తయ్య, పెండెం సత్యనారాయణ, ప్రతినిధులు పోరెడ్డి రంగయ్య, బండారు జయశ్రీ, పెసరు లింగారెడ్డి, శ్రీపాద శివప్రసాద్, శ్రీనివాస్, అరవిందరాయుడు, ఉమ్మడి జిల్లా కవులు, సాహితీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...