సంప్రదాయాలను కొనసాగించాలి


Tue,August 13, 2019 02:15 AM

- కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్
మిర్యాలగూడ రూరల్ : నాగరితలో ఎంత ఎదిగిన మన సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని వీడకుండా కొనసాగించాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్ అన్నారు. సోమవారం మండలం పరిధిలోని దుబ్బతండాలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు. నాగరికత పరంగాను, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధ్ది చెందాలని, దానితో గిరిజనులు సంప్రదాయ దుస్తువులు , కట్టు, బొట్టు వీడొద్దని, అవి మన సంస్కృతికి చిహ్నాలని, వాటివల్ల జాతి గౌరవం పెరుగుతుందన్నారు.

కొండ కోనల్లో ఉండే గిరిజనులు స్వయం కృషితో ఆర్థికంగాను, విద్య, ఉద్యోగాల్లో రానిస్తుండటం అభినందనీయమన్నారు. వెనుక బడిన గిరిజనులకు చేయూతనిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం తండాలోని మహిళలు, యువతులు పట్టువస్ర్తాలు ధరించి వారం రోజుల పాటు బుట్టల్లో పెంచిన గోధుమ నారును తలపై ధరించి గ్రామంలోని దేవత వద్దకు వెళ్లి నారు బుట్టలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నారు బట్టులను సమీప చెరువుల్లో వదిలి వేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ధీరావత్ స్కైలాబ్‌నాయక్, సర్పంచ్ అంజమ్మ, హరినాయక్, ఎంపీటీసీ సుజాతబాలూనాయక్, అంజి, రాంబాబు, శరత్, బాలు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...