మహిళా విద్యాసంస్థల ఎదుట షీటీంను పటిష్టం చేయాలి


Tue,August 13, 2019 02:15 AM

-బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీడయ్యయాదవ్
మిర్యాలగూడ అర్బన్ : రాష్ట్రంలోని బాలికలు, మహిళావిద్యాసంస్థల వద్ద షీ టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్యయాదవ్ అన్నారు. సోమవారం స్థానికంగా జరిగిన సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలు చదువుకునే చోట ఆకతాయిలు బైక్‌లపై తిరుగుతూ విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. దీంతో ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. సమావేశంలో శంకర్, యాదగిరి, లవకుమార్, శ్రీను, మహేష్, కిశోర్, అశోక్ ఉన్నారు.

స.హ. చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా సందీప్
వేములపల్లి : సమాచార హక్కు పరిరక్షణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలో ని శెట్టిపాలెం గ్రామానికి చెం దిన దూపాటి సందీప్ నియామకం అయ్యారు. సోమవా రం ఆ సంఘం జిల్లా అధ్యక్షు డు నారబత్తుల అనంతాచారి శెట్టిపాలెంలో నియమకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కల్పిస్తూ లమచం ఇవ్వకుండా పని చేసుకోవడం తమ హక్కు అని తెలుసుకునే విధంగా చైతన్య పరుస్తానన్నారు. కార్యక్రమంలో రమేష్, మహేష్, వెంకటేష్ పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...