పాఠ్యాంశం అర్థయ్యేలా బోధించేందుకు


Tue,August 13, 2019 02:14 AM

-చర్యలు తీసుకోవాలి : రాము
మిర్యాలగూడ అర్బన్ : విద్యార్థులు పాఠ్యాంశం అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు శాస్త్రీయ దృక్పథంతో బోధించే విద్యావ్యవస్థను రాష్ట్రప్రభుత్వం తీసుకురావాలని ఏఐఎస్‌బీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి పరంగి రాము అన్నారు. పట్టణంలోని విజేత డిగ్రీ కళాశాలలో ఏఐఎస్‌బీ(ఆలిండియా బ్లాక్) ఆధ్వర్యంలో సోమవారం ప్రస్తుత విద్యా వ్యవస్థ-దాని పరిణామాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విద్యావ్యవస్థ పాశ్యాత్య పోకడలను అవలంభిస్తుండటంతో విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టి పట్టావల్సి వస్తుందన్నారు. విద్యార్థులకు అర్థవంతమయ్యేలా బోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చెన్నబోయిన నర్సమ్మ, చిట్టెమ్మ, నర్సింహ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలి : పరమేష్
మిర్యాలగూడ అర్బన్ : ఉద్యోగ ఉపాధ్యాయులకు 62 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు కోల సైదులు అన్నారు. సోమవారం స్థానికంగా జరిగిన బీసీ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘం ముఖ్యనాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సుధీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలచి, సీపీఎస్ విధానం రద్దు చేయాలన్నారు. నాచియప్పన్ సిఫార్సులు అమలు పరిచి బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సమావేశంలో నాయకులు తవిడ సైదులు, శ్రీనివాసాచారి, వెంకటేశ్వర్లు, మచ్చ వెంకటేశ్వర్లు, సోమలింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...