నేడు బక్రీద్ పర్వదినం..


Mon,August 12, 2019 01:36 AM

-ముస్తాబైన ఈద్గాలు, మసీదులు
- మునుగోడురోడ్డు ఈద్గాలో హాజరుకానున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
-అంతటా పోలీసుల భారీ బందోబస్తు

నల్లగొండకల్చరల్ : త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే పండుగ బక్రీద్. నేడు సోమవారం ఈ పండుగను జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. వేకువజామున లేచి ఖుర్బాని ఇచ్చిన అనంతరం ఈద్గాలు, మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకు అంతటా వాటిని సిద్ధంచేసి ఆయా కమిటీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సర్వం సిద్ధంచేశారు. జిల్లాకేంద్రంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గాలో జరిగే ప్రార్థనలకు పెద్దఎత్తున ముస్లిం సోదరులు తరలి రానున్నారు. నమాజ్ అనంతరం ఖాబ్బరాస్తాన్‌కు వెళ్లి పుష్పాలు సమర్పిస్తారు.

జిల్లా ఈద్గా ముస్తాబు
నల్లగొండ జిల్లా కేంద్రంలో అతిపెద్దదైన ఈద్గా మునుగోడు రోడ్డులోనిదే. ఇక్కడ రంజాన్, బక్రీద్‌కు ముస్లీంలు ప్రత్యేక ప్రార్థనలు(నమాజ్) చేసేందుకు జిల్లా అధికార యంత్రంగంతోపాటు మున్సిపాల్టివారు వారంరోజుల ముందునుంచే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డీఎస్సీ పర్యవేక్షణలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు కొనసాగించి ఈద్గాలోపలికి వెళ్లే ప్రతిఒక్కరిని క్షుణంగా తనిఖీలు చేసిన తర్వాతనే అనుమతిస్తారు.

వేడుకకు అధికారులు, ప్రజాప్రతినిధులు
జిల్లాకేంద్రంలోని మునుగోడు రోడ్డులోని ఈద్గా వద్ద జరిగే బక్రీద్ వేడుకకు జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఇన్‌చార్జీ ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు, జేసీ చంద్రశేఖర్‌తోపాటు మంత్రి, ఎంపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు వస్తారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...