పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


Mon,August 12, 2019 01:33 AM

దేవరకొండ, నమస్తే తెలంగాణ : దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల 1972-74 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం పొరుగున ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా సిరిసనగండ్ల గ్రామంలో నిర్వహించారు. దేప దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో తమ కుటుంబ సభ్యులతో హాజరైన పూర్వ విద్యార్థులు తమ గురువు పంగునూరి లింగయ్యను సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అంతాకలిసి సహాయనిధిని ఏర్పాటుచేసి స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజికసేవ చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా దేప జనార్థన్‌రెడ్డి మొదటిగా రూ.50 వేలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంకం చంద్రమౌళి, అచ్చ చంద్రయ్య, జి దామోదర్ రెడ్డి, వనం బుచ్చయ్య, గంజి కృష్ణయ్య, వాసా మురళి, బెజవాడ నరేందర్, గజ్జలయ్య, దశరథం, విశ్వనాథం తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

వేములపల్లి మండల కేంద్రంలో..
వేములపల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87వ సంవత్సరంలో 10వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయం సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం సహ విద్యార్థి పోలా రామక్రిష్ణ కుటుంబానికి 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఇరుగువెంకటయ్య, చిర్రమల్లయ్య యాదవ్, ఆవుల జానయ్య, గంజి శ్రీనివాస్, మల్లయ్య, ఆసీం, వెంకటయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంరెడ్డి, సత్యనారయణ, అరుణ, పారిజాత, పద్మ, రాధ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...