వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి


Mon,August 12, 2019 01:33 AM

అడవిదేవులపల్లి : ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని సర్పంచ్ కొత్త మర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అడవిదేవులపల్లిలో మిర్యాలగూడ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతీఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. 20 మందికి కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు కంటి వైద్యుడు వికాస్ గుర్తించారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, హనుమంతరాం, గంగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...